నల్లగొండ: భువనగిరి యాదాద్రి జిల్లా హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి మొబైల్ లో 200కు పైగా పోర్న్ వీడియోలా కనిపించాయి. దాన్ని బట్టి అతను లైంగిక ఆసక్తి వెర్రితలలు వేసిన విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు మైనర్ బాలికలను రేప్ చేసి, హత్య చేసిన కేసుల్లో మరణశిక్ష, ఓ మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసిన కేసులో జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే.

శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించి అందులో 277 వీడియోల్లో పోర్న్ కంటెంట్ ఉన్నట్లు తేల్చారు. రాచకొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ లో శ్రీనివాస్ రెడ్డి లైంగిక ఆసక్తి వెర్రితలలు వేసిందని, అతను ఐదు లైంగిక నేరాల్లో పాల్గొన్నాడని చెప్పారు. ఈ ఐదు కేసుల్లో మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డికి శిక్ష పడింది. 

Also Read: శ్రీనివాస్ రెడ్డికి ఉరి, హాజీపూర్‌ కేసును అలా ఛేదించాం: సీపీ మహేశ్ భగవత్

శ్రీనివాస్ రెడ్డి తొలి నేరం 2015లో హజీపూర్ లో చేసినట్లు తెలిపారు. ఓ 14 బాలికపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి బావిలో పాతిపెట్టిన విషయం బయటపడడంతో హజీపూర్ లో అతను చేసిన మూడు నేరాలు వెలుగు చూశాయి. ఈ బాలికపై శ్రీనివాస్ రెడ్డి చేసిన అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు హజీపూర్ లో అదృశ్యమైన ఇద్దరు బాలికలకు సంబంధించిన విషయం తెలిసింది. 

14 ఏళ్ల మృతురాలి బుక్స్, బ్యాగ్ పోలీసులకు దొరికింది. ఆ క్లూతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బావిలో మెరూన్ బ్యాగ్, నాలుగు లాంగ్ బుక్స్, రెండు పాఠ్యపుస్తకాలు పోలీసులకు లభించాయి. ఆ తర్వాత మరిన్ని బాలికకు సంబంధించిన వస్తులను పోలీసులు సేకరించారు. అవి తమ కూతురివేనని బాలిక తల్లిదండ్రులు గుర్తించారు. 

Also Read: హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష

కేసును దర్యాప్తు చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరమే కాకుండా మరో రెండు నేరాలు కూడా అటువంటివే చేశానని పోలీసుల విచారణలో అతను అంగీకరించారు. బాలికల శరీరాలపై ఉన్న డిఎన్ఏ శాంపిల్స్ శ్రీనివాస్ రెడ్డి డిఎన్ఎ శాంపిల్స్ తో సరిపోలాయి. దీంతో శ్రీనివాస్ రెడ్డి నేరం చేశాడని శాస్త్రీయ విశ్లేషణ ద్వారా నిర్ధారించారు.