Asianet News TeluguAsianet News Telugu

కొందరు హైదరాబాదీలు చిల్లర పనులు చేస్తారు

  • మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటిఆర్
  • కుత్బుల్లాపూర్ లో షురూ 
  • చిల్లర పనులు చేసేవారి గురించి వివరించిన కేటిఆర్
KTR takes jibes at cheap habits of few hyderabadis

రాజకీయ నేతలు చాలా సందర్భాల్లో ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. ఇది సహజం. గింత ఉంటే ఎంతో ఉన్నట్లు.. ఏం లేకపోయినా ఉన్నట్లు చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ నేతల నోటినుంచి వాస్తవాలు చాలా తక్కువ సందర్భాల్లోనే వస్తాయి. ఇక తెలంగాణలో రాజకీయ నేతలు చాలామంది వాస్తవాలు పక్కనపెట్టి సత్యదూరమైన విషయాలనే చెబుతారు.

కానీ తెలంగాణ ఐటి శాఖ మంత్ర మాత్రం కొంచెం కఠువుగానే ఉన్నప్పటికీ చాలా వాస్తవాలను వెల్లడించారు. హైదరాబాద్ లో మన నగరం కార్యక్రమానికి కేటిఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ లో మన నగరం కార్యక్రమాన్ని కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ పలు సందర్భాల్లో గట్టిగానే చురకలు వేశారు. ఆయన చిచోర పనులు చేసేవాళ్లున్నారంటూ ఆయన ఏమన్నారో చదవండి.

1 మనం హైదరాబాద్ లో చెత్తను వేరు చేయడానికి ఇంటింటికీ రెండు బుట్టులు ఇచ్చినం. కానీ జనాలు వాటిని చెత్త వేరు చేసి అందించేందుకు వాడుతున్నరా? కొన్ని విషయాలు నిష్టూరంగా ఉన్నా మాట్లాడుకోక తప్పదు. నిజంగా ఎంతమంది చెత్త బుట్టలు వాడుతున్నరు? నీలం రంగు బుట్ట, ఆకుపచ్చు బుట్టలను తీసుకుపోయి ఒకదాంట్లో బియ్యం, ఇంకకోదాంట్లె పప్పులు పోశి పెట్టుకుంటున్నరు కదా? అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతేనా?

2 దేశంలోనే మన మెట్రో రైలు ప్రతిష్టాత్మకమైనది. మన నగరం మన మెట్రో అని కళల ప్రాజెక్టు గా భావిస్తున్నం. కానీ కొందరేం చేస్తున్నరో చెప్పాల్నా? అప్పుడే మెట్రోలో కొందరు జనాలు పాన్లు తిని ఉయ్యడం షురూ చేసిర్రు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ప్రజల ప్రాజెక్టును మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఏం లాభం. ఇట్ల గలీజ్ చేస్తే ఎట్లా?

3 ట్యాంక్ బండ్ మీద అందంగా ఉండేందుకు లవ్ హైదరాబాద్ అని పెట్టినం. దాని దగ్గర పొటోలు తీసుకుంటే బాగానే ఉంటది. కానీ దాన్ని అట్లనే ఉంచిర్రా? దానిమీద పిచ్చి రాతలు రాసి... దానిచుట్టూ గలీజ్ చేసిర్రు. ఇదేనా మన నగరం ఉంచుకునే పద్ధతి ?

ఇది నాది.. ఇది నా నగరం అనే సోయి ఉండాలి. నాది.. మనది అన్న స్పుహ రావాలి. సోయిలేని తనం, లెక్కలేని తనం పోవాలి. అటువంటి భావన విడనాడాలి. జవాబుదారీతనం ఉండాలి. అప్పుడే నగరాన్ని బాగుచేసుకోగలం. మన ఇంటిని మనం ఎలా ఉంచుకుంటామో నగరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అని కేటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటిఆర్ వాస్తవాలు చెప్పడంతో సభలో పాల్గొన్నవారంతా నిజమే నిజమే అంటూ చప్పట్లు కొట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios