హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు కాలు విరిగినట్లు సమాచారం. అతడు ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో స్వల్ఫ గాయాలు కాగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 

తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షుకు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు  తుంటి, మోకాలు వద్ద స్వల్ఫంగా ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. దీంతో హిమాన్షు కాలికి కట్టుకట్టిన డాక్టర్లు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. 

read more   కేటీఆర్ కు సవాల్: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్

ఇప్పటికే మంత్రి కేటీఆర్ దంపతులు హాస్పిటల్ లోనే  కొడుకుతో పాటే వున్నట్లు సమాచారం. ఇక సీఎం కేసీఆర్ కూడా మనవడి ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్ డాక్టర్లకు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనవడు హిమాన్షు అంటే చాలా ప్రేమ. చాలా సందర్బాల్లో ఆ ప్రేమన బహిరంగంగానే వ్యక్తపరిచారు సీఎం. ముఖ్యంగా కుటుంబంతో కలిసి బయటకు వెళ్లే సమయాల్లో సీఎం తన మనవడిని పక్కనే పెట్టుకుని అతడితో సరదాగా గడుపుతాడు. అలాంటిది మనవడికి గాయాలు కావడంతో సీఎం కేసీఆర్ అల్లాడిపోయి వుంటారు.