కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. రైతుల‌ను కాంగ్రెస్ పూర్తిగా గాలికివ‌దిలేసింద‌ని, తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, రైతుల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రభుత్వం మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు.

"ఆనాటి దుస్థితి మళ్లీ వచ్చింది"

కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ – “2014కి ముందు రైతులు అర్ధరాత్రి బాయికాడ కరెంటు కోసం బైట కాపులు కాచాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు. అదే పరిస్థితిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెచ్చింది” అని అన్నారు.

Scroll to load tweet…

"ఇప్పుడు యూరియా కోసం రాత్రంతా లైన్లో"

“2025లో రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల ముందే అర్ధరాత్రి నుంచే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇల్లు వదిలి కార్యాలయాల దగ్గర నిద్రించాల్సిన పరిస్థితి రైతులకు వచ్చి పడింది” అని విమర్శించారు.

"మార్పు పేరుతో మోసం"

“కాంగ్రెస్ తెచ్చింది గొప్ప మార్పు ఇదేనా? రైతులు పంట గురించి ఆలోచించకుండా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇదేనా వారు చెప్పే పాలన? వారెవ్వా ఎంత గొప్ప మార్పు!” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.