మహేష్ బాబు సినిమా టైటిల్ మార్పు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్

KTR says no role in changing Mahesh babu Cinema title
Highlights

మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమా టైటిల్ మార్పులో తన పాత్ర లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటి రామారావు స్పష్టం చేశారు.

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమా టైటిల్ మార్పులో తన పాత్ర లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటి రామారావు స్పష్టం చేశారు. భరత్ అనే సినిమా టైటిల్ ను కేటీఆర్ మార్పించుకున్నారని కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి కేటిఆర్ శుక్రవారం వివరణ ఇచ్చారు. 

తిరిగి తామే అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని,  2019 ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రజలు కేసీఆర్ ను ఏకోన్ముఖంగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల్లో ఉండనని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే అధికారంలోకి వస్తుందని చెప్పారు. తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందని కాంగ్రెసు నమ్మిందని, అందుకే కర్ణాటక శాసనసభ్యులను హైదరాబాదు తీసుకుని వచ్చిందని ఆయన అన్నారు.  

loader