హైదరాబాద్ డబుల్ ఇండ్లపై కేటిఆర్ నజర్

హైదరాబాద్ డబుల్ ఇండ్లపై కేటిఆర్ నజర్

హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ఎస్సార్డీపి, డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమాలపైన మంత్రి కెటి రామరావు సమీక్ష నిర్వహించారు. బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, కమీషనర్ జనార్ధనరెడ్డి, ఇంజనీరింగ్ సిబ్బంది, వర్కింగ్ ఎజెన్సీల ప్రతినిధులు పాల్గోన్నారు.

ముందుగా ఎస్సార్డీపి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న వివిధ  పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన డెడ్ లైన్ల మేరకు పనులు పూర్తి కావాలని అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో అన్నారు.  అయా పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుబంధ శాఖలైన వాటర్ వర్క్, విద్యుత్ శాఖలతో సమన్వయానికి వచ్చే వారం ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ఈ ప్రాజెక్టుల అమలులో ఏదైనా సమస్యలు వస్తే నేరుగా తనకు తెలియజేయాలని చెప్పారు. ఏస్సార్డిపీ కార్యక్రమం కింద దుర్గం చెరువు, కూకట్పల్లి, బాలనగర్, ఏల్ బి నగర్ ప్లైఓవర్ల నిర్మాణం, ఖాజాగూడా టన్నెల్,  అర్టీసి క్రాస్ రోడ్డు దగ్గర చేపట్టనున్న స్టీల్ బ్రిడ్జ్ పనుల గురించి సమీక్షించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల తాలుకు పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, సూమారు అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక భాద్యతలు చేపట్టిన భారతి, అడిషనల్ కమీషనర్ అధ్వర్యంలో మరింత వేగంగా ముందుకు పోవాలన్నారు.

ఈ నెల 5వ తేదిన స్టీల్ తయారీదారులతో ఒక సమావేశాన్ని ఎర్పాటు చేస్తున్నట్లు, డిగ్నీటి హౌసింగ్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని నీర్ణీత ధరకు స్టీలు సరఫరా చేయాలని వారిని కోరనున్నట్లు మంత్రి తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page