వైరల్ వీడియోపై స్పందించిన కేటీఆర్
సూర్యపేట కు చెందిన వ్యక్తి ఒకరు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతను మోసం చేయడమే కాకుండా.. ఇద్దరు యువకులను చితకబాదిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. సదరు నేత టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాడంటూ ఆన్ లైన్ లో మారుమోగింది.
దీనిపై ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి తారకరామారావు స్పందించారు. యువకులను చితకబాదిన వ్యక్తి టీఆర్‌ఎస్ సభ్యుడు కాదని, ఈ విషయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్రువీకరించారని తెలిపారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశానని చుప్పారు.
తాను టీఆర్ఎస్ నేత అని, మంత్రి జగదీశ్‌కు అనుచరుడనని చెప్పుకొంటూ సంతోష్ అనే వ్యక్తి నిరుద్యోగుల నుంచి లక్షలు తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతను ఇద్దరు యువకులను కొట్టిన వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టింది.
తన కాళ్ల దగ్గర కూర్చున్న ఇద్దరు యువకులను చితక్కొడుతున్న సన్నివేశం
సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు.
