తమని చూసి తాము మురిసిపోయే యాంకర్ల ఒంటెత్తు ఉపన్యాసంలో నేను పాల్గొనలేను.టివిలలో అర్థవంతమయిన చర్చలు, వాదనలు చాలా అరుదు. మీడియా టిపిఆర్ ల కోసం పరుగు తీస్తూ ఉంది.
ఇపుడు టివిలలో సాగుతున్న డిబేట్ల మీద తెలంగాణా ఐటి మంత్రి కె తారక రామారావు(కెటిఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ డిబేట్ల మీద తన లో అసంతృప్తిని ఈ రోజు ట్విట్టర్ లో వెల్లడించారు.
తానేందుకు టివి డిబేట్లలో పాల్గొనరో కూడా ఆయన వివరించారు. క్లుప్తంగానే నయినా సమకాలీన మీడియా ప్రవర్తన ఎలా వ్యతిరేక దోరణిని అలవర్చుకుందో కూడా చెప్పారు.
తమని చూసి తాము మురిసిపోయే యాంకర్ల 'స్వగతం’లో నేను పాల్గొనలేనని నిక్కచ్చిగా చెప్పారు. టివిలలో ఈ మధ్య అర్థవంతమయిన చర్చలు, వాదనలు చాలా అరుదు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
"నేను కేవలం ఉన్నదాన్నే చెబుతున్నాను. మీడియాలో ఉన్న పరిస్థితులవల్ల అక్కడున్నవాళ్లు కూడా సంతోషంగా లేరు. దీనికి మచ్చుతనక ఈ మధ్య నే లాంచ్ చేసిన ఒక చానెల్" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
"ఇదంతా మనం చేసే ఉద్యోగ ధర్మమే. మీడియాని తప్పూ పట్టలేం. ఎందుకంటే వాళ్లంతా టిఆర్ పి పరుగులో ఉన్నారు. దురదృష్టవశాత్తు వ్యతిరేక వార్తలకు మంచి టిఆర్ పి వస్తుంది."అన్నారు.
అయితే, కెటిఆర్ వ్యాఖ్యల మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది.
ఒకాయన కెటిఆర్ ని కొత్త గా లాంచ్ అయిన ఇంగ్లీష్ చానెల్ ‘రిపబ్లిక్’ డిబేట్ లో చూడాలనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరొకరేమో, అన్ని చానెల్స్ టిపిఆర్ ల కోసం పరుగుతీయడంలేదని వాదించారు. ఈ కారణాన మీడియా మొత్తాన్ని తప్పుపట్టలేమని చెప్పారు.
ఒకరేమో మీడియాతో జాగ్రత్తగా ఉండండని హెచ్చరిక కూడా చేశారు.
