Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కృషివల్లే... తెలంగాణలో మరో హరితవిప్లవం: మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. 

KTR Participated Telangana Formation Day Celebrations at siricilla akp
Author
Sircilla, First Published Jun 2, 2021, 3:11 PM IST

సిరిసిల్ల: వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం ఏ నాయకుడు ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కర్షక ప్రభుత్వమని కేటీఆర్ పేర్కొన్నారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన కేటీఆర్ ఆ తర్వాత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో హరిత విప్లవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెరలేపారని అన్నారు. ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో మత్తల్లు దూకించినా ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం నీళ్ళు  తీసుకొచ్చి జిల్లాలోని కుడెల్లి వాగుని నింపిన ఘనత కూడా కేసీఆర్ ది అన్నారు. 

read more  ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ:గన్ పార్క్ వద్ద అమరులకు కేసీఆర్ నివాళులు

''రైతాంగానికి రైతు బీమా, రైతు బంధు పథకాల ద్వారా ప్రోత్సాహం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ సంవత్సరం జిల్లాలో 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తే మూడు లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం ప్రతి రైతు బంపర్ దిగుమతి సాధించాడు. దీనికి గల కారణం సీఎం కేసీఆర్ రైతుల పట్ల అవలంబిస్తున్న నిర్ణయాలే'' అని కేసీఆర్ ను ఆకాశానికెత్తారు కేటీఆర్. 

''సిరిసిల్ల పెద్దూరులో 22 కోట్లతో నిర్మించిన అధునాతమైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ పూర్తయింది. ఈనెల 11న వ్యవసాయ మంత్రితో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అలాగే ఈనెల 15వ తారీకు నుంచి రైతులకు, రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయి'' అని మంత్రి ప్రకటించారు. 

 ఫారెస్ట్ భూములకు సంబంధించిన వివాదాలు ఉంటె కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాల్సినగా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం కూడా ఫారెస్ట్ భూముల వివాదాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios