Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ:గన్ పార్క్ వద్ద అమరులకు కేసీఆర్ నివాళులు

 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఉదయం నివాళులర్పించారు. 

CM KCR Pays homage to Telangana martyrs at Gunpark in Hyderabad lns
Author
Hyderabad, First Published Jun 2, 2021, 9:25 AM IST

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఉదయం నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తోంది. గన్ పార్క్ వద్ద సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి,  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. 

గత ఏడాది కూడ కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడ నిరాడంబరంగా నిర్వహించారు.  తొలి దశతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలువురు తమ ప్రాణాలు త్యాగం చేశారు  గన్ పార్మ్ వద్ద నివాళులర్పించిన సందర్భంగా పలువురు అమరులను స్మరించుకొన్నారు. అమరుల స్మారక మందిరాన్ని నిర్మింవచేందుకు కూడ తెలంగాణ ప్రభుత్వం కసర్తు చేస్తోంది. దీనికి సంబందించిన డిజైన్లను కూడ తయారు చేయిస్తోంది. 

ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా కారణంగా ప్రగతి భవన్  కే వేడుకలను పరిమితం చేశారు. లేకపోతే గోల్కొండ కోట లేదా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో కార్యక్రమం నిర్వహించేవారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios