రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైద్రాబాద్ ఒక మహానగరంగా విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
హైదరాబాద్ : రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైద్రాబాద్ ఒక మహానగరంగా విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడిందన్నారు. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. 1933లో చాదర్‌ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదని ఆయన ఆరోపించారు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి రాలేదన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.
also read:ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కీలక బిల్లులపై చర్చ
2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామన్నారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.
అంతకుముంద సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది.
1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020, 2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 20203. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు - 2020 4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు - 2020 లను మంత్రులు ప్రవేశపెట్టారు.
