హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి.

సభ్యులంతా కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. విడివిడిగా ఈ బిల్లులపై చర్చలు ఉంటాయని స్పీకర్ తెలిపారు. మున్సిపల్ సవరణ బిల్లును తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సభలో ప్రవేశపెట్టారు.  ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ చట్టానికి  ఐదు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి.

జీహెచ్ఎంసీ బడ్జెట్ లో హరిత హారానికి పది శాతం నిధులను కేటాయించాలి,  జీహెచ్ఎంసీలోని మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను మహిళలు ప్రాతినిథ్యం కల్పించేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ప్రతి పదేళ్లకు ఒక్కసారి  స్థానిక సంస్థల వార్డుల రిజర్వేషన్లు  మార్చేలా చట్టసవరణ బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రి. ఒక్కో డివిజన్ లో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కమిటీలో 25 మంది సభ్యులుంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సీర్పీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. ఈ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.