కేటీఆర్ కు హిమాన్షు మోటర్స్ లో వాటా ఉంది. ఆయన ఎన్నీక సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ ఎన్నీకల అధికారికి డిమాండ్ పత్రాన్ని అందజేసిన లేప్ట్ నేతలు
తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటిఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లెప్ట్ పార్టీ నేతలు ఆరోపించారు. కేటిఆర్ ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు లెప్ట్ నేతలు విన్నవించారు.
సిపిఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి తమ్మినేని ఇతర లెప్ట్ పార్టీ నేతలు కలిసి సచివాలయంలో ఎన్నీకల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ ని కలిశారు. ఆయనకు లెప్ట్ నేతలు ఒక పత్రాన్ని సమర్పించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ కేటిఆర్ హిమాన్షు మోటార్స్ లో కేటిఆర్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు. కానీ తనకి ఏమాత్రం సంబంధం లేనట్లు వ్యవహారిస్తున్నారని ఆయన అన్నారు. ఆయన చట్ట విరుద్ధంగా మంత్రి గా కొనసాగుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేటిఆర్ గతంలో 2014 ఎన్నికల్లో తన అఫిడవిట్ లో జత చేశారని, అంతేకాకుండా ఐటి టాక్స్ లో 2016 లో కూడా తన హిమాన్ష్ మోటర్స్ లో ఉన్నట్లు పత్రాలను చూపించారని తమ్మినేని తెలిపారు. వాటికి సంబంధించిన అఫిడవిట్ సాక్ష్యాలను ఆయన బయటపెట్టారు.
ఒక మంత్రిగా ఉండి మరో ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగడం సబబు కాదని తమ్మినేని అన్నారు. కేటిఆర్ తన పదవిని దుర్వినియోగం చేశారని, అందుకే ఆయన ఎన్నీక ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
