తెలంగాణ మెడికల్ కాలేజీల విషయమై కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలపై రాష్ట్రమంత్రి కేటీఆర్ స్పందించారు. కిషన్ రెడ్డి, మన్సుఖ్ మాండవీయా, నిర్మలా సీతారామన్‌లు చేసిన ప్రకటనలను వరుసగా ఉటంకిస్తూ.. కనీసం అబద్ధాలైనా సరిగ్గా ఆడేలా శిక్షణ ఇవ్వండని వ్యంగ్యంగా ప్రధాని మోడీకి సూచనలు చేశారు. ఆ ముగ్గురిలోనూ మన కిషన్ రెడ్డి మేలిమిముత్యం అంటూ కామెంట్లు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రులపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి అసలు ప్రతిపాదనలే రాలేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులపై వాగ్బాణాలు విసిరారు.

Scroll to load tweet…

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విషయమై ముగ్గురు కేంద్రమంత్రులు ఇలా స్పందించారని ఒక్కొక్కరిని ఏకరువు పెట్టారు. తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలను మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క ప్రతిపాదన కూడా మెడికల్ కాలేజీ కోసం రాలేదని తెలిపారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామాన్ మాత్రం రెండు ప్రతిపాదనలు రిసీవ్ చేసుకున్నట్టు వివరించారని గుర్తు చేశారు. ఈ ముగ్గురు కామెంట్లనూ పేర్కొంటూ మోడీ గారు.. అబద్ధాలు సరిగ్గా చెప్పడానికైనా మీ మంత్రులకు శిక్షణ ఇప్పించండి అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Also Read: ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు.. హిమాన్షు వీడియో లింక్ ట్వీట్ షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

ఇందులోనూ మన కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఆణిముత్యం అని వర్ణించారు. ఎందుకంటే.. ఆయన ఎలాంటి పూర్వాపరాలు, హామీలు, నిధుల ఊసు లేకుండానే తెలంగాణలో 9 మెడికల్ కాలేజీల ప్రకటన చేశారని విమర్శించారు. మరోటి గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఓ కల్పిత సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నదనీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారని తెలిపారు.