కేటీఆర్ కొడుకు హిమాన్షు తాను పాడిన పాట యూట్యూబ్ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత తన అల్లుడిపై ప్రశంసలు కురిపించారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో హిమాన్షు ట్వీట్ షేర్ చేశారు. కల్వకుంట్ల హిమాన్షు తాను పాడిన ఓ కవర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ఆ కవర్ లింక్‌తో ఉన్న హిమాన్షు ట్వీట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షేర్ చేశారు. అదే విధంగా అల్లుడిపై ప్రశంసలు కురిపించారు.
చెవులకు శ్రావ్యమైన స్వరాన్ని వినిపించావు అల్లుడు.. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నదని పొగిడారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అల్లుడు అని పేర్కొన్నారు. అంతేకాదు, హిమాన్షు చేసే మరో మ్యూజిక్ కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు.
హిమాన్షు రావు కల్వకుంట్ల తన పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్‌లో రెండు గంటల క్రితమే గోల్డెన్ అవర్ అనే టైటిల్‌తో ఓ పాటను పోస్టు చేశారు. ఆ యూట్యూబ్ వీడియో లింక్‌ను ట్విట్టర్‌లోనూ షేర్ చేశారు. 2.40 నిమిషాల నిడివితో ఉన్న ఇంగ్లీష్ పాటను ఆయన పాడారు.
Also Read: మహా శివరాత్రి కోసం 2,427 ప్రత్యేక బస్సులు.. భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు
తండ్రి కేటీఆర్ కూడా తన కొడుకును పొగిడారు. కొడుకు పట్ల గర్వపడుతున్నట్టు వివరించారు. అంతేకాదు, ఎగ్జైట్ అవుతున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ మ్యూజిక్ చాలా బాగుందని కితాబిచ్చారు.
