సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు... నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బావ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘సిద్ధిపేట ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ హరీష్ రావుకి నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషాలతో ప్రజా సేవలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కింద హరీష్ రావుతో కలిసి దిగిన ఓ ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ ట్వీట్ కి అభిమానుల నుంచి స్పందన కూడా బాగానే ఉంది. కేటీఆర్ అభిమానులు కూడా హరీష్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.