Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 8న భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కేటీఆర్

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఆందోళనలో పాల్గొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. 

KTR appeals to telangana people to support to bharath bandh lns
Author
Hyderabad, First Published Dec 6, 2020, 5:28 PM IST


హైదరాబాద్:  నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా ఆందోళనలో పాల్గొంటారని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. 

ఆదివారంనాడు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాల్ని దేశంపై రుద్దిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు. రైతు బిడ్డగా ఈ చట్టాలను నిరసిస్తూ  రైతులకు ఆందోళన చేపట్టినట్టుగా చెప్పారు.

ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్న రైతులకు సెల్యూట్ చేస్తున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.రైతులకు సంఘీభావంగా ఈ నెల 8వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా కేటీఆర్ తెలిపారు.

also read:కొత్తగా ఎన్నికైన కార్పోరేట్లతో కేటీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

ఈ నెల 8వ తేదీన రైతులకు మద్దతుగా కనీసం రెండు గంటల పాటు వ్యాపారవర్గాలు దుకాణాలు మూసివేసి  రైతాంగానికి మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.రవాణా రంగంలోని వారు కూడ బంద్ కు సహకరించాల్సిందిగా కోరారు. 

రూ. 60 వేల కోట్లు వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం జరిగినట్టుగా బంద్ విజయవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో బంద్ ను విజయవంతం చేసి ఢిల్లీలో రైతులకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios