Asianet News TeluguAsianet News Telugu

ఆగష్టు 9న కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం: తెలంగాణ ఈ సారి హాజరయ్యేనా?

 ఈ నెల 9న జలసౌధలో జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ అత్యవసర భేటీ నిర్వహించనున్నట్టుగా కేఆర్ఎంబీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమాచారం అందించింది.

KRMB GRMB oordination committee meeting will be held on August 09 lns
Author
Hyderabad, First Published Aug 5, 2021, 3:58 PM IST


హైదరాబాద్:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నారు. ఇటీవల కాలంలో  నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు.దీంతో ఈ నెల 9వ తేదీన మరోసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం ఇటీవలనే గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం . ఈ గెజిట్ ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

also read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీ: ఆ ప్రాజెక్టుల వివరాలివ్వలేమన్న ఏపీ, తెలంగాణ డుమ్మా

గెజిట్‌ నోటిఫికేషన్లలోని నిర్ణయించిన అంశాలను గడువులోపుగా  అమలయ్యేలా తేదీలవారీగా ప్రణాళికలు తయారు చేసి పంపాలని కేంద్ర జల్‌శక్తిమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మెన్లకు లేఖలు రాశారు.ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జలసౌధలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కేఆర్ఎంబీ ప్రకటించింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు కేఆర్ఎంబీ సమాచారం పంపింది.గత సమావేశానికి హాజరుకాని తెలంగాణ అధికారులు ఈ నెల 9వ తేదీన జరిగే సమావేశానికి హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios