Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీ: ఆ ప్రాజెక్టుల వివరాలివ్వలేమన్న ఏపీ, తెలంగాణ డుమ్మా

జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అయితే ఈ ఉమ్మడి బేటీ తర్వాతే పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తామని బోర్డులు తెలిపాయి.

Telangana officials skip first joint meeting of panel from Godavari, Krishna river boards lns
Author
Hyderabad, First Published Aug 3, 2021, 3:30 PM IST

హైదరాబాద్: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశానికి  తెలంగాణ నీటిపారుదలశాఖాధికారులు  గైర్హాజరయ్యారు.  ఈ సమావేశానికి ఏపీ అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డుల పరిధిలోకి  తీసుకొచ్చింది కేంద్రం. అయితే బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను  తీసుకురావడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవాళ నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. 

also read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సంయుక్త సమావేశం: తెలంగాణ ప్రతినిధులు హాజరయ్యేనా?

ఏపీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి సహా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కూడ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన ప్రాజెక్టుల వివరాలను ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో చెప్పారు.గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పారు. ప్రాజెక్టుల వివరాలను ఇచ్చి కేంద్రంతో తమ అభ్యంతరాల గురించి చర్చించాలని బోర్డులు సూచించాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోనని ఈఎన్సీ  బోర్డులకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు.

ఈ సమావేశానికి సంబంధించి బోర్డు అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం పంపారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. ఈ సమావేశానికి ముందే పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే ఈ సమావేశం తర్వాత పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని బోర్డు అధికారులు సమాచారం ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios