Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీ కీలక నిర్ణయం: ఈ నెల 14 నుండి గెజిట్ అమలు

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తున్నామని కేఆర్ఎంబీ ప్రకటించింది. ఈ నెల 14 నుండి గెజిట్ నోటిపికేషన్ ను అమలు చేయనుంది. కేఆర్ఎంబీ సమావేశంలో ఇవాళ హైద్రాబాద్ జలసౌధలో జరిగింది.

KRMB decides to implement gazette notification on Krishna projects
Author
Hyderabad, First Published Oct 12, 2021, 4:23 PM IST

హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులతో పాటు వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు బోర్డుకు అప్పగించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కేఆర్ఎంబీ ఛైర్మెన్  ఎంపి సింగ్ ప్రకటించింది.

also read:పెద్దవాగులోప్రయోగాత్మకంగా గెజిట్ అమలు: జీఆర్ఎంబీ కీలక నిర్ణయం

ఈ నెల 14 నుండి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుందని కేఆర్ఎంబీ ఛైర్మెన్ mp singh ప్రకటించారు.దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్టు అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి రానున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్ఎంబీ కోరింది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు నేపథ్యంలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేక.పోలేదు.మంగళవారం నాడు హైద్రాబాద్ జల సౌధలో  krmb సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గతంలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 14 నుండి ఈ నోటిఫికేషన్లను అమలు చేయాలి.  ఈ విషయమై ప్రధానంగా చర్చించారు.అయితే  నీటి కేటాయింపులు లేకుండానే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడాన్ని  తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఈ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వాలని ఏపీ అడుగుతుందన్నారు. ఈ నెల 14 లోపుగా స్పష్టమైన నిర్ణయాలు వెల్లడిస్తామన్నారు. ఈ విషయమై కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి  త్వరలోనే చెబుతామని రజత్ కుమార్ వివరించారు.విద్యుత్ ఉత్పత్తిపై అధికారం ఇవ్వాలని కోరామన్నారు. ప్రోటోకాల్ ప్రకారంగా అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తి చేయవద్దని చెప్పామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios