Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ప్రభుత్వానికి గల్లంతైన సొమ్ము వెనక్కిచ్చిన ఐవోబీ.. ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను ప్రభుత్వానికి వెనక్కిచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) (indian overseas bank). ఈ బ్యాంక్ బ్రాంచ్‌లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్‌డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు

indian overseas bank returned rs 9 crores missing amount to ap govt in fd scam
Author
Vijayawada, First Published Oct 15, 2021, 5:51 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రభుత్వ శాఖలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతు కుంభకోణంలో నిధులను ప్రభుత్వానికి వెనక్కిచ్చింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) (indian overseas bank). ఈ బ్యాంక్ బ్రాంచ్‌లోని గిడ్డంకుల శాఖకు చెందిన ఎఫ్‌డీల నుంచి రూ.9.6 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. దీనిపై ఐవోబీ యాజమాన్యం స్పందించింది. దీంతో గిడ్డంకుల శాఖ అకౌంట్‌లో రూ.9.6 కోట్లను బ్యాంక్ డిపాజిట్ చేసింది. వడ్డీ డబ్బులు కూడా ఎఫ్‌డీల మెచ్యూర్ అయ్యేనాటికి ఇస్తామని ఐవోబీ తెలిపింది. బ్యాంక్ సిబ్బంది సహకారంతో స్కామ్ జరిగినట్లు నిర్థారణ అయ్యింది. దీనిపై గిడ్డంకుల శాఖ ఎండీ స్పందించారు. అమౌంట్ అంతా వెనక్కి వచ్చిందని ఆయన తెలిపారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది.

Also Read:ఎఫ్‌డీల స్కామ్: పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ వర్గాలు.. దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీ నిధుల గల్లంతుపై గురువారం రెండు ఫిర్యాదులు అందాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో రూ.9 కోట్లు కొట్టేయడంపై భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు అందింది. అలాగే ఏపీ ఆయిల్ ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేయడంపై ఆత్కూర్ పీఎస్‌లో ఫిర్యాదు అందింది. ఐవోబీ, సప్తగిరి బ్యాంకుల్లో ఎఫ్‌డీలను సొంత అకౌంట్లకు బదిలీ చేశారు నిందితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిక్స్‌డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు, అదనపు సమాచారం కోరారు. గల్లంతైన సొమ్ము చెల్లించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి ఆయా బ్యాంకు యాజమాన్యాలు. ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపైనా దర్యాప్తు చేస్తామని తెలిపింది. 

కాగా, తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన ముఠా ఏపీ ప్రభుత్వానికి చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని గుర్తించారు పోలీసులు. ఈ మేరకు ఏపీ అధికారులకు తెలంగాణ సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు.telugu akademi స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన saikumar ముఠా ap ware housing corporation, ap oil federation ల నుండి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ నుండి రూ. 9 కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్ నుండి రూ. 6 కోట్లను కొల్లగొట్టారని అధికారులు గుర్తించారు. గిడ్డంగుల శాఖకు రూ. 32 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి.అయితే bhavanipuram iobలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.9.60 లక్షలను నిందితులు డ్రా చేశారని ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ ఎండీ తెలిపారు. ఐఓబీ బ్యాంకుల్లోని 34 ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నగదు గల్లంతైందని గుర్తించామని ఎండీ చెప్పారు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు మాట్లాడారు. దీంతో బ్యాంకు అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై విచారణ చేస్తున్నారు.తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని  వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios