స్వామిగౌడ్ ది నాటకమని కేసిఆరే ఒప్పుకున్నారు (వీడియో)

స్వామిగౌడ్ ది నాటకమని కేసిఆరే ఒప్పుకున్నారు (వీడియో)

సోమవారం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ తగిలి శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయమైందని అధికార పార్టీ పెద్దలు చెబుతూ వచ్చారు. కానీ అదంతా నాటకం అని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కేసిఆర్ ఆడించిన నాటకంలో ఛైర్మన్ పావుగా ఉన్నారంటూ ఉత్తమ్ ధ్వజమెత్తుతూ ఉన్నారు.

అయితే తాజాగా సభలోనే సిఎం కేసిఆర్ తాము ఆడింది నాటకమే అని ఒప్పుకున్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మాటకు బలం చేకూర్చే వీడియోను ( మంగళవారం అసెంబ్లీలో కేసిఆర్ మాట్లాడిన స్పీచ్ లోంచి తీసుకుని) సోషల్ మీడియాకు వదిలింది కాంగ్రెస్ పార్టీ. ఆ వీడియోలో నాటకం విషయాన్ని కేసిఆర్ తేటతెల్లంగా చెప్పారంటూ కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ సభ్యులు సభలో హుందాగా ఉంటే నాటకం ఆడాల్సిన అవసరం మాకెందుకు వస్తది అంటూ కేసిఆర్ కామెంట్ చేశారు. దాని అర్థం ఏమంటే మీరు హుందాగా లేరు కాబట్టే మేం నాటకం ఆడాము అన్నారని కాంగ్రెస్ వాదన.

మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింద వీడియో ఉంది మీరూ చూడండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos