టీడీపీ తనకు కన్నతల్లి లాంటిదని.. రాజీనామా చేయకతప్పే పరిస్థితి కనిపించడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
మక్తల్ : టిడిపికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతతో కలిసి టిడిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లి లాంటిది అన్నారు. రాజకీయ సమీకరణాల అనుగుణంగా పార్టీ మార్పు తప్పనిసరిగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు సూచించిన పార్టీలో చేరతానని అన్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
