జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఒంగోలులో దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఒంగోలులో దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. దీప్తి అనుమానాస్పద మృతి నేపథ్యంలో చందనపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పాస్‌పోర్ట్ తీసుకుని విదేశాలకు పారిపోయిందన్న నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
బిటెక్ చదివే సమయంలో పరిచమైన స్నేహితుడితో చందన ప్రేమాయణం సాగిస్తున్నట్లు... అతడితోనే ఆమె పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్ళిన ఆ రాత్రి అక్కాచెల్లి దీప్తి, చందన మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందోగానీ దీప్తి శవమై తేలగా, చందన కనపించకుండా పోయింది. తాను ప్రేమించే యువకుడితోనే చందన వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: కోరుట్ల దీప్తి మృతదేహంపై గాయాలు? పోస్టు మార్టం రిపోర్ట్ లోనే అసలు మేటరంతా..!
ఇంట్లోని నగదు, బంగారంతో పాటు తన పాస్ పోర్ట్ కూడా తీసుకుని చందన వెళ్ళిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె విదేశాలకు పారిపోయే అవకాశాలుండటంతో ముందుగానే జాగ్రత్తపడ్డ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అంతేకాదు హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు బస్టాండులు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా చందన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అక్కను తాను చంపలేదంటూ చందన తమ్ముడికి వాయిస్ మెసేజ్ పంపిన విషయం తెలిసిందే.దీంతో ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమె ఎక్కడుందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే చందన చదువుకున్నది హైదరాబాద్ లోనే కాబట్టి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడివాడే అయివుంటాడని అనుమానిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వీరి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
అయితే చందనతో పాటు ఆమె భాయ్ ప్రెండ్ ఫోన్లు స్విచ్చాప్ లో వుండటంతో ఎక్కడున్నారో గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. వారి ఫ్రెండ్స్ వివరాలు సేకరించిన పోలీసులు అక్కడికేమైనా వెళ్ళారేమోనని ఆరా తీస్తున్నారు. చందన కాల్ డేటా ఆధారంగా భాయ్ ప్రెండ్ నంబర్ కనుక్కున్నా అతడు తప్పుడు అడ్రస్ తో సిమ్ కార్డ్ తీసుకున్నట్లు తేలింది.
