MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • కోరుట్ల దీప్తి మృతదేహంపై గాయాలు? పోస్టు మార్టం రిపోర్ట్ లోనే అసలు మేటరంతా..!

కోరుట్ల దీప్తి మృతదేహంపై గాయాలు? పోస్టు మార్టం రిపోర్ట్ లోనే అసలు మేటరంతా..!

కోరుట్లలో మందు పార్టీ చేసుకున్న అక్కాచెల్లెల్లలో ఒకరు అనుమానాస్పద రీతిలో మృతిచెందడం, ఇంకకరు భాయ్ ప్రెండ్ తో పరారవడంతో సంచలనం సృష్టించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 31 2023, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Korutla

Korutla

జగిత్యాల : కోరుట్ల పట్టణంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ దీప్తి అనుమానాస్పద మ‌ృతి తెలంగాణలో సంచలనం సృష్టించింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భాయ్ ప్రెండ్ తో కలిసి చెల్లి చందన అక్కను చంపివుంటుందని అనుమానిస్తున్నారు. తాజాగా అనుమానితురాలు చందనతో పాటు ఆమె భాయ్ ప్రెండ్ పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంలేదు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Korutla

Korutla

అక్కతో కలిసి ఇంట్లోనే మద్యం సేవించిన చందన భాయ్ ప్రెండ్ పరారయ్యింది. ఏమయ్యిందో తెలీదుగానీ అక్క దీప్తీ మృతిచెందడం, చెల్లి నగదు, బంగారంతో పరారవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ బయటకురానున్న దీప్తి పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. దీప్తి మృతిపై నెలకొన్న అనుమానాలపై ఈ పోస్టుమార్టం రిపోర్ట్ తో కొంత క్లారిటీ రానుంది. దీప్తిది హత్యా? ఆత్మహత్యా? అన్నది తేలనుంది. 
 

36
Korutla

Korutla

 ఇక అక్కను తాను చంపలేదంటూ చందన తమ్ముడికి పంపిన వాయిస్ మెసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చందన ఎక్కడుందో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. భాయ్ ప్రెండ్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్లు తేలడంతో ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టారు. దీంతో భాయ్ ప్రెండ్, చందన పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. 

46
Korutla

Korutla

దీప్తి మృతదేహంపై గాయాలను కుటుంబసభ్యులు గుర్తించినట్లు సమాచారం. దీంతో హత్యకు ముందు ఆమెపై ఏదయినా అఘాయిత్యం జరిగిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అక్కను తాను చంపలేదని... ఇంట్లోంచి వెళ్లిపోయే సమయంలో ఆమె మద్యంమత్తులో పడిపోయి వుందని చందన చెబుతోంది. దీంతో చెల్లి వెళ్లిపోయాక ఇంకెవరైనా ఆ ఇంటికి వచ్చారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 
 

56
Korutla

Korutla

 అక్క దీప్తిని తానేమీ చేయలేదంటూ తమ్ముడికి చందన వాయిస్ మెసేజ్ పంపింది. అలాగే ఇంట్లోని రూ.2 లక్షల నగదు, 50 తులాల బంగారం మాయమయ్యాయి. డబ్బులు తీసుకెళ్లినట్లు ఒప్పుకున్న చందన బంగారం గురించి ప్రస్తావించలేదు. కాబట్టి బంగారం కోసం మరెవరైనా దీప్తిని హతమార్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 


 

66
Korutla

Korutla

ఇదిలావుంటే కోరుట్ల బస్టాండ్ లోని సిసి ఫుటేజీలో వున్నది చందన, ఆమె భాయ్ ప్రెండ్ కాదని పోలీసులు నిర్దారించారు. చందన తన క్లాస్ మేట్ తో కలిసి కారులో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నగదుతో పాటు నగలు కూడా చందన తీసుకెళ్లిందా లేక ఇంకెవరైన నగలు తీసుకెళ్లారా అన్నది తెలియాల్సి వుంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved