కొండాపూర్ గాయత్రి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గాయత్రి ఆస్తిని ఆమె తల్లి, సోదరి కొట్టేయాలని భావిస్తున్నారని ఆమె భర్త శ్రీకాంత్ మీడియాతో చెప్పాడు. అయితే గాయత్రి అరాచకాలకు తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. 

హైదరాబాద్ (hyderabad) గచ్చిబౌలిలో యువతిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు గాయత్రి తల్లి, సోదరిలు గాయత్రి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. గాయత్రి (gayathri) , శ్రీకాంత్ (srikanth) పెద్ద క్రిమినల్స్ అని.. ఆస్తి కోసం శ్రీకాంత్ తన చెల్లిని అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. అయితే మీడియాలో వస్తున్న కథనాలపై శ్రీకాంత్ స్పందించాడు. గాయత్రి అరాచకాలకు తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. మీడియాలో వస్తున్న కథనాలపై తనకు సమాచారం లేదని శ్రీకాంత్ చెబుతున్నాడు. 

ఆస్తి పంపకాల్లో గాయత్రిని ఆమె తల్లి, సోదరే వేధించారని అతను ఆరోపిస్తున్నాడు. గాయత్రికి ఆస్తి దక్కకుండా కొట్టేయాలని ఆమె తల్లి, సోదరే ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ చెబుతున్నాడు. ఆస్తి పంపకాలు పూర్తయ్యాక గాయత్రి తల్లి, సోదరి తమ ఆస్తులను అమ్మేసుకున్నారని వెల్లడించాడు. గాయత్రి మాత్రం తనకు వచ్చిన వాటాను అమ్ముకోలేదని శ్రీకాంత్ అంటున్నాడు. ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి గాయత్రి ఆస్తిలో మళ్లీ వాటా కావాలని అంటున్నారని అతను ఆరోపిస్తున్నాడు. 

Also Read:కొండాపూర్ యువతిపై అమానుషం.. గాయత్రి తల్లి, సోదరిపై కేసు నమోదు.. ఆస్తికోసం రచ్చకెక్కిన కుటుంబసభ్యులు..

కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన దంపతులు రత్నరాజు, కృష్ణవేణి. కూతుళ్లు సౌజన్య, గాయత్రి, కుమారుడు ప్రదీప్ రాజు. సైన్యంలో పనిచేసిన రత్నరాజు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. చిన్న కూతురు గాయత్రి 2009లో ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరంగా వెళ్ళింది. ఆ తరువాత భర్త నుంచి విడిపోయిన ఆమె శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆస్తి పంపకాలలో తలెత్తిన గొడవలతో రత్న రాజు, కృష్ణవేణి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తనను వేధిస్తున్నాడంటూ భర్తపై కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీ రామ్ నగర్ కాలనీ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 215 పార్ట్, 216, 217, 218, 229, 230 పార్ట్ లోని ఇంట్లో గాయత్రి తన భర్త శ్రీకాంత్ తో గత కొంత కాలంగా నివాసముంటుంది. రత్నరాజు చిన్న కూతురు దగ్గర ఉంటున్నాడు. 2015లో రత్నరాజు మరణించాక గొడవలు మరింత ముదిరాయి. గాయత్రి ఉన్న ఫ్లాట్ లోకి కృష్ణవేణి, సౌజన్య అక్రమంగా ప్రవేశించారంటూ గతంలో కేసు నమోదైంది. కుటుంబంలో తగాదాలు జరుగుతున్న సమయంలోనే సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీకాంత్ కు ఆంధ్రాకు చెందిన యువతి దగ్గరైంది.

భర్త ఆ యువతితో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని గాయత్రీ ఐదుగురు యువకులను లైంగిక దాడికి పురిగొల్పింది. ఆ కేసులో గాయత్రి జైలుకు వెళ్లడంతో.. తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య, సోదరుడు ప్రదీప్ రాజు, బాబాయ్ మల్లికార్జున్ ఆదివారం కొండాపూర్లోని శ్రీరాంనగర్ లోని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. శ్రీకాంత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్లాట్, దుకాణాల్లోకి అక్రమంగా ప్రవేశించిన విషయంలో సౌజన్యపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. 

అసలేం జరిగిందంటే…
గాయత్రి కొండాపూర్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి భాగస్వామి శ్రీకాంత్ సివిల్ కోచింగ్ సమయంలో బాధితురాలిని కలిశాడు. గాయత్రి తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో ఆమెతో కలిసి ఉండాల్సిందిగా బాధితురాలిని కోరాడు. బాధితురాలు అక్టోబర్ 2021 నుంచి ఫిబ్రవరి 22వరకు గాయత్రితో పాటు వెళ్ళింది.

అయితే, శ్రీకాంత్, బాధితురాలి మధ్య సంబంధం ఉందని అనుమానించింది. ప్రణాళిక ప్రకారం ఐదుగురు వ్యక్తులను గాయత్రి ఇంట్లోని బాధితురాలి వద్దకు తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారం చేయించి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.