హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆలస్యంగా అభ్యర్ధిని బరిలోకి దించడంపై నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. 

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దల ముందే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆలస్యంగా అభ్యర్ధిని బరిలోకి దించడంపై నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. 

కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంపై ఉత్తమ్‌ను టార్గెట్ చేశారు పొన్నం. హుజురాబాద్ ఫలితాలపై ఒక్కొక్కరిని పిలిచి విడి విడదిగా అడగాలనీ వీహెచ్ కోరారు. ఎవరు రిఫర్ చేస్తే బల్మూరి వెంకట్‌కు టికెట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అసలు హుజూరాబాద్ లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు ఏమందంటూ వీహెచ్ (v hanumantha rao) నిలదీశారు. తెలంగాణ కంటే ఏపీలో పార్టీ లేకపోయినా కాంగ్రెస్‌కు ఆరు వేల ఓట్లు వచ్చిన విషయాన్ని హనుమంతన్న గుర్తు చేశారు. కొండా సురేఖకు (konda surekha) టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా వీహెచ్ ప్రశ్నించారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీకి రేవంత్‌ రెడ్డిపై (Revanth reddy) కొండా సురేఖ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. 

Also Read:కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులు .. ఇలాగైతే పార్టీ క్లోజే : ఢిల్లీ పెద్దల ముందే పొన్నం ప్రభాకర్ ఆరోపణలు

ఆ ఫిర్యాదు లేఖను కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చారు వీహెచ్. హుజూరాబాద్ ఓటమిపై అధిష్టానం ఆవేదనలో ఉందని.. మేం లేటుగా ప్రచారం ప్రారంభించామని.. అభ్యర్థి ఎంపిక కూడా లేట్ చేశామని ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయని వీహెచ్ వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా ఉండే కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. ఇందిరమ్మ ఓటు బ్యాంకు ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. మాకు ఓటు వేస్తామని హామీ ఇచ్చిన ప్రజల ఓట్లు కూడా పడలేదని అన్నారు. గతంలో సెకండ్ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందని హనుమంతరావు చెప్పారు. 2023లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో కొట్లాడాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.

ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి (koushik reddy) వ్యవహారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) మాట్లాడుతూ.. ఆయన పార్టీని వీడి వెళ్లిపోయిన 4 నెలల వరకు అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదన్నారు. మరోవైపు తనను సమావేశానికి పిలవకపోవడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోనియా (sonia gandhi), రాహుల్ గాంధీకి (rahul gandhi) లేఖ రాశారు. కరీంనగర్ ఇన్‌ఛార్జ్‌గా వున్న తనను ఇవాళ్టీ సమావేశానికి పిలవకపోవడం బాధ కలిగించిందని జగ్గారెడ్డి (jagga reddy) ఆవేదన వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ దగ్గర డబ్బు లేదని తెలిసి కూడా పీసీసీ చీఫ్ పట్టించుకోలేదన్నారు. అయితే రేవంత్ స్పందిస్తూ.. అందరి అభిప్రాయం తీసుకున్నాకే ముందుకు వెళ్లానని రేవంత్ రెడ్డి చెప్పారు.