Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులు .. ఇలాగైతే పార్టీ క్లోజే : ఢిల్లీ పెద్దల ముందే పొన్నం ప్రభాకర్ ఆరోపణలు

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దల ముందే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. 

few congress leaders are working for trs says ponnam prabhakar in delhi
Author
New Delhi, First Published Nov 13, 2021, 4:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దల ముందే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (uttam kumar reddy) సోదరుడు (కజిన్‌) కౌశిక్‌రెడ్డికి (koushik reddy) ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు ఆయన మాటలకు అడ్డురావడంతో.. పొన్నం ఇంకా రెచ్చిపోయారు. దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయాలంటూ సవాల్‌ విసిరారు. ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా తనను బాధ్యుడిని చేసే విమర్శలు అర్థరహితం అంటూ ప్రభాకర్‌ మండిపడ్డారు. హుజురాబాద్ మీదే కాకుండా గతంలో జరిగిన నాగార్జునసాగర్, హుజూర్ నగర్, దుబ్బాక ఓటమి పై కూడా సమీక్షలు నిర్వ హించాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉంటూ కొందరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కే కేశవరావు, డీ శ్రీనివాస్‌లు రాజ్యసభ సభ్యులయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీని మోసం చేశారంటూ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే  ఈ పరస్పర ఆరోపణలకు చెక్ పడకపోవడంతో ముఖ్య నేతలు పార్టీ సమావేశాన్ని అర్దాంతరంగా ముగించారు. సాయంత్రం మరొసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన బహిరంగంగా ఏం మాట్లాడినా పార్టీకిమరింత సమస్యలు వస్తాయనే కారణంతోనే జగ్గారెడ్డిని దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు.

అటు కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో హుజూరాబాద్ పై చేసిన సమీక్షలో టీపీసీసీ నేతల వార్ పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాకూర్ (manickam tagore) కీలక వ్యాఖ్యలు చేసారు. సమన్యయ లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ..సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీంగా తయారైందని ఠాగూర్ పేర్కొన్నారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఆ రెండు పార్టీల వ్యవహారం సాగుతోందని ఆయన ఆరోపించారు. 

ALso Read:హుజురాబాద్‌‌ సమీక్ష.. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చానన్న ఠాగూర్.. జగ్గారెడ్డికి అందని పిలుపు

తెలంగాణలో ధాన్యం కొనుగోలు (paddy) పైనా డ్రామాలు ఆడతున్నారని విమర్శించారు. మీటింగ్‌లో భిన్నాభిప్రాయాలు వచ్చినా.. పార్టీ పరిస్థితిపైన వాస్తవాలు తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసారు. అసలు హుజూరాబాద్ లో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు ఏమందంటూ సీనియర్ నేత వీహెచ్ (v hanumantha rao) ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఏపీలో పార్టీ లేకపోయినా కాంగ్రెస్‌కు ఆరు వేల ఓట్లు వచ్చిన విషయాన్ని హనుమంతన్న గుర్తు చేశారు. కొండా సురేఖకు (konda surekha) టికెట్ ఎందుకు ఇవ్వలేదని వీహెచ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి రేవంత్‌పై (Revanth reddy) కొండా సురేఖ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. 

ఆ ఫిర్యాదు లేఖను కేసీ వేణుగోపాల్‌కు ఇచ్చారు వీహెచ్. హుజూరాబాద్ ఓటమిపై అధిష్టానం ఆవేదనలో ఉందని.. మేం లేటుగా ప్రచారం ప్రారంభించామని.. అభ్యర్థి ఎంపిక కూడా లేట్ చేశామని ప్రజల్లో ఆరోపణలు ఉన్నాయని వీహెచ్ వ్యాఖ్యానించారు. సంప్రదాయంగా ఉండే కాంగ్రెస్ ఓటు బ్యాంకు.. ఇందిరమ్మ ఓటు బ్యాంకు ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు. మాకు ఓటు వేస్తామని హామీ ఇచ్చిన ప్రజల ఓట్లు కూడా పడలేదని అన్నారు. గతంలో సెకండ్ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందని హనుమంతరావు చెప్పారు. 2023లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో కొట్లాడాలంటే గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. అటు కాంగ్రెస్  నేతలపై కేసీ వేణుగోపాల్ సైతం ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారానికి జనాలు వచ్చారని పెద్ద పెద్ద ఫోటోలు పంపారని.. ప్రచారానికి వచ్చిన వారు కూడా ఓట్లు వేయలేదా అని ఆయన నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios