Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు జానారెడ్డి సవాల్... నిరూపిస్తే అన్నమాట ప్రకారం నడుచుకుంటా : జానారెడ్డి

తెలంగాణ లో అప్పుడే రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్దం మొదలైంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హుస్నామాద్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పై పలు విమర్శలు చేసిన విశయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి సవాల్ విసిరారని... ఆ సవాల్ ను స్వీకరించి టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రసంగంలో తనను టార్గెట్ చేయడంతో జానారెడ్డి ఎదురుదాడికి దిగారు.

Jana Reddy Criticises CM KCR Over Comments on husnabad meeting
Author
Hyderabad, First Published Sep 8, 2018, 12:01 PM IST

తెలంగాణ లో అప్పుడే రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్దం మొదలైంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం హుస్నామాద్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పై పలు విమర్శలు చేసిన విశయం తెలిసిందే. తెలంగాణ ప్రజలకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని జానారెడ్డి సవాల్ విసిరారని... ఆ సవాల్ ను స్వీకరించి టీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రసంగంలో తనను టార్గెట్ చేయడంతో జానారెడ్డి ఎదురుదాడికి దిగారు.

ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జానారెడ్డి కేసీఆర్ అసత్య ప్రచారాలతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కేసీఆర్ అన్న మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ గులాబీ కండువా కప్పుకుంటా అని అసెంబ్లీలో అన్నట్లుగా నిరూపిస్తే 24 గంటల్లో అస్త్రసన్యాసం గానీ, రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే అన్నమాట ప్రకారం నడుచుకుంటానని అన్నారు. అసెంబ్లీ లో తాను మాట్లాడిన మాటలను రికార్డుల నుండి బైటికి తీసి ప్రజలముందుంచాలని జానారెడ్డి సవాల్ చేశారు.నిరూపించలేకపోతే వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

అనంతరం జానారెడ్డి తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి మాట్లాడిన వీడియోను మీడియా ముందుంచారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ఎందుకు వెళుతున్నాడని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిని ప్రజలకు, మీడియా గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని జానారెడ్డి అన్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios