Asianet News TeluguAsianet News Telugu

నేను రెడీ.. ఆరోపణలు నిరూపించకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా?: రేవంత్‌ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి చాలెంజ్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. సీఎం అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

komatireddy rajgopal reddy Open challenge to revanth reddy
Author
First Published Aug 3, 2022, 12:12 PM IST

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని.. సీఎం అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే టీడీపీని ఖతం చేసి.. కాంగ్రెస్‌లో చేరి డబ్బులు పెట్టి పీసీసీ పదవి కొన్నాడని ఆరోపించారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి స్పీకర్‌కు రాజీనామా ఇవ్వకుండా.. చంద్రబాబుకు రాజీనామా పత్రాన్ని ఇచ్చారని విమర్శించారు. ఉప ఎన్నికకు భయపడి రేవంత్ రెడ్డి.. ఉత్తుత్తి రాజీనామా చేసి డ్రామాలు చేశారని మండిపడ్డారు. 

సోనియా గాంధీని రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలి దేవత అన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఓ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. మూడు పార్టీలు మారిన వ్యక్తి రేవంత్ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌కు నాలుగోది అని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారనే విషయం అందరికి తెలుసని అన్నారు. ‘‘రేవంత్ రెడ్డి బ్రాండ్.. బ్లాక్ మెయిలర్’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వ్యాపారాలు లేకుండా రేవంత్ రెడ్డికి వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము తమదని అన్నారు. తెలంగాణ ఉద్యంలో రేవంత్ ఏం చేశాడని ప్రశ్నించారు. జయశంకర్, కోదండరామ్‌‌లను ఎంతో మందిని తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. సోనియా గాంధీని తాను ఎప్పుడు అవమానపరచలేదని చెప్పారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు కూడా.. పావురాల గుట్ట మీద పావురమై పోయిండని రేవంత్ విమర్శలు చేశాడని అన్నారు. అందుకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను ప్రదర్వించారు. 

20 ఏళ్లు కాంగ్రెస్‌ను తిట్టిన వ్యక్తి.. ఈ రోజు తనపై విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాము కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం పనిచేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించాడా? అని ప్రశ్నించారు. తాను బ్లాక్‌మెయిలింగ్ చేసి డబ్బులు చేసిన వ్యక్తిని కాదన్నారు. పార్టీ మారేది.. కుటుంబ పాలనను అంతమొందించడానికి మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయంగా బురద చల్లడానికి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు. కాంగ్రెస్ రక్తం తమదని.. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తితో నీతులు చెప్పించుకోవాలా? అంటూ ఫైర్ అయ్యారు. ఆత్మగౌరవం చంపుకుని రేవంత్ రెడ్డి కింద పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీకి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని ఓపెన్ చాలెంజ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios