అనుచరులతో చర్చలు: బీజేపీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొగ్గు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. ఈ విషయమై పార్టీ ముఖ్య నేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల్లోగా తమ అభిప్రాయాలు చెప్పాలని రాజగోపాల్ రెడ్డి కోరినట్టుగా సమాచారం.

Komatireddy Rajagopal Reddy talks with With His followers about joining in BJP

హైదరాబాద్: Munugode  ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddy  కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మండలాలవారీగా Congress పార్టీ ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. నియోకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇవాళ సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాలకర చెందిన నాయకుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. .వారం రోజుల్లో తమ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారని సమాచారం.

పార్టీ మార్పుతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై అభిప్రాయం చెప్పాలని ముఖ్యనేతలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచిస్తున్నట్టుగా సమాచారం.  వారం లోపుగా అభిప్రాయాలు చెప్పాలని నేతలకు సూచించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని ఈ నెల 24న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.ఈ విషయమై కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో CLP  నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. భట్టి విక్రమార్క  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో  చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కూడా అదే రోజున చర్చలు జరిపారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా కూడా చెప్పారు. :GHMC, దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను కూడా రాజగోపాల్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. 

ఇటీవలనే కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah షా ను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. అమిత్ షా ను కలిసిన మాట వాస్తవమేనని ఆయన ప్రకటించారు. అయితే బీజేపీలో చేరిక విషయమై తాను అమిత్ షాతో చర్చించలేదని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. 

also read:బీజేపీలో చేరిక‌పై రాజ్ గోపాల్ రెడ్డి స్ప‌ష్ట‌త‌.. ఆగ‌స్టు రెండో వారంలోనే ముహూర్తం..

ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాషట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా చర్చించినట్టుగా సమాచారం.మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని బీజేపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని బండి సంజయ్ ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి కూడ పలువురు నేతలు కూడా బీజేపీలో చేరుతారని బండి సంజయ్ వివరించారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం తీసుకొంటున్న నిర్ణయాలు కూడా సరిగా లేవనే అభిప్రాయాన్ని రాజగోపాల్ రెడ్డి కూడా వ్యక్తం చేశారు. మరో వైపు పార్టీలో తనకు సముచిత గౌరవం లేదనే అభిప్రాయాన్ని రెండు రోజుల క్రితం తనతో మాట్లాడేందుకు వచ్చిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios