కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ: గజ్వేల్‌లో పోటీపై చర్చ


కాంగ్రెస్ జాతీయ ప్రధాన  కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ తో  మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇవాళ భేటీ అయ్యారు.

Komatireddy Rajagopal Reddy meets Congress Leader KC Venugopal in New delhi lns

న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో  మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారంనాడు భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇవాళ  న్యూఢీల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీకి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నేరుగా  కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. 

మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పోటీ చేయనున్నారు. గజ్వేల్ లో  బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ పై  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బరిలోకి దిగనున్నారు. ఈ విషయమై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీ వేణుగోపాల్  తో చర్చించనున్నారు.

  ఈ నెల  25న  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయని ప్రజలు భావిస్తున్నారని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రజల అభిప్రాయం మేరకు తాను  కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి  ప్రకటించారు. 

2022 ఆగస్టు మాసంలో  కాంగ్రెస్ కు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. 2022 అక్టోబర్ మాసంలో మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో   బీజేపీ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

also read:కాంగ్రెస్ అధిష్టానం పిలుపు: న్యూఢిల్లీకి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

గత కొంతకాలంగా బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన  బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోని అసంతృప్తులు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి డీకే అరుణలు బీజేపీని వీడుతారనే ప్రచారం సాగుతుంది. తాము బీజేపీని వీడడం లేదని  వివేక్ వెంకటస్వామి, డీకే అరుణలు ప్రకటించారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని  వివేక్ వెంకటస్వామి నిన్న ప్రకటించారు.  తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ తనకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను బీజేపీని వీడాల్సిన అవసరం లేదని  డీకే అరుణ ప్రకటించారు. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్  ఉన్న సమయంలో ఆయనపై ఓ వర్గం పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసింది.  బండి సంజయ్ స్థానంలో  కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. తప్పుడు ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చేయవద్దని  బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios