కాంగ్రెస్ అధిష్టానం పిలుపు: న్యూఢిల్లీకి చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఇవాళ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. 

Former MLA Komatireddy Rajagopal Reddy Reaches To New delhi lns

న్యూఢిల్లీ: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  గురువారంనాడు ఉదయం  న్యూఢీల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీకి చేరుకున్నారు. 

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి ఈ నెల  25న రాజీనామా చేశారు. రేపు కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేశారు. దీంతో ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూఢీల్లీకి చేరుకున్నారు.

also read:కోమటిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు:నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి

2022 ఆగస్టు మాసంలో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు.  బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నిన్న బీజేపీకి రాజీనామా చేశారు.నిన్న సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  తన అనుచరులతో  సమావేశమయ్యారు. 

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను గద్దెదించాలనే లక్ష్యంతో  తాను ఏడాది క్రితం  బీజేపీలో చేరినట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే  ఏడాది క్రితం  పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు.  తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని భావిస్తున్నారన్నారు.ఈ కారణంగానే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. 

వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి  బరిలోకి దిగనున్నారు.  ఇదిలా ఉంటే బీజేపీలోని మరికొందరు అసంతృప్తులు  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని  కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడ  బీజేపీని వీడుతారని ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని వివేక్ వెంకటస్వామి కొట్టిపారేశారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని వివేక్ వెంకటస్వామి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios