Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి బ్రదర్స్‌నే విమర్శిస్తావా... ఇక కాంగ్రెస్‌లో ఎవరూ వుండరు : రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు.. రేవంత్ నాయకత్వంపై సంతోషంగా లేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 
 

komatireddy rajagopal reddy fires on tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published Aug 5, 2022, 9:54 PM IST

కోమటిరెడ్డి బ్రదర్స్‌ను విమర్శించడమే రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒక చిల్లర దొంగ.. పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కానుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉంటారనే నమ్మకం వుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు.. రేవంత్ నాయకత్వంపై సంతోషంగా లేరని కోమటిరెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లోని నేతలంతా బయటకు వస్తారని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ రోజున తెలంగాణకు అమిత్ షా రానున్నారు. ఢిల్లీలో శుక్రవారం అమిత్ షాను కలిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్ షా తనను పార్టీలోకి ఆహ్వానించారని.. రాజీనామా లేఖ ఇవ్వడానికి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నానని ఆయన చెప్పారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. 

Also REad:దుర్మార్గుడు, కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ : మునుగోడు గడ్డపై రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ నిప్పులు

బహిరంగ సభ పెట్టే బీజేపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ లేకున్నా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అయిత్ షా సమక్షంలో తనతో పాటు మరికొందరు బీజేపీలో చేరతారని ఆయన వెల్లడించారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిస్తారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 8న స్పీకర్ లేకుండా.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖ ఇస్తానని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో వెంకటరెడ్డి కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటరెడ్డి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios