Asianet News TeluguAsianet News Telugu

దుర్మార్గుడు, కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ : మునుగోడు గడ్డపై రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ నిప్పులు

ఒక దుర్మార్గుడు, ఒక కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి అంటూ ఫైరయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నమ్మిన నాయకురాలిని, భుజాన మోసిన కార్యకర్తలను నట్టేట ముంచి పక్క పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 
 

tpcc chief revanth reddy serious comments on komatireddy rajagopal reddy
Author
Munugodu, First Published Aug 5, 2022, 7:44 PM IST

నమ్మిన నాయకురాలిని, భుజాన మోసిన కార్యకర్తలను నట్టేట ముంచి పక్క పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుణపాఠం చెప్పాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో శుక్రవారం చండూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వర్షానికి పారిపోయే వారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్ట్ పార్టీ జెండా.. లేదంటే కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. 

ఈ ప్రాంతానికి చెందిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని రేవంత్ ప్రశంసించారు. జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మాధవరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారంలో లేకున్నా పనులు చేయలేదా అని ఆయన గుర్తుచేశారు. దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వనప్పటికీ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తిరిగి కాంగ్రెస్‌లోనే చేరారని రేవంత్ తెలిపారు. 

Also Read:ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

2018 ఎన్నికల్లో టికెట్ దక్కనప్పటికీ పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ విజయం కోసం శ్రమించారని ఆయన గుర్తుచేశారు. వందల ఎకరాల భూములు కరిగిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పాల్వాయి గోవర్థన్ రెడ్డి విడిచిపెట్టలేదని రేవంత్ కొనియాడారు. ఆరు దశాబ్ధాల తెలంగాణ కలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన అన్నారు. మూసేసిన కేసులో సోనియాకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోడీ.. ఈడీని ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సోనియా గాంధీని ఈడీ అధికారులు హింసిస్తుంటే .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా పంచన చేరాడని రేవంత్ మండిపడ్డారు. సోనియా కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడని ఆయన మండిపడ్డారు. అసలు రాజగోపాల్ రెడ్డి మనిషేనా అంటూ ఫైరయ్యారు. ఇదే సమయంలో ఆయనపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కమీనేగాడు, కుత్తేగాడు, కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి అంటూ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios