Asianet News TeluguAsianet News Telugu

విపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చావా.. అహంకారం ఎవరిది : కేసీఆర్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. 

komatireddy raja gopal reddy counter to cm kcr over his remarks on bjp
Author
Hyderabad, First Published Aug 20, 2022, 9:53 PM IST

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని.. కనీసం సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలకు అపాయింట్‌ ఇవ్వడం లేదంటే అది కేసీఆర్‌ అహంకారం కాదా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

మునుగోడు తీర్పుతో కేసీఆర్ దిగిపోవడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందని.. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవం కోసమే వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్న కేసీఆర్ మాటలు అవాస్తవాలని.. ముఖ్యమంత్రి తన ప్రాభవం కోసం బీజేపీపై నిందలు వేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

అంతకుముందు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల బాయిల కాడ కరెంట్ మీటర్లు పెట్టమంటే తాను పెట్టలేదని చెప్పారు. రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారని ఆరోపించారు. రైతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని.. మన బతుకు ఎన్నిక అని కేసీఆర్ చెప్పారు. ప్రజలు దీని గురించి గ్రామాల్లో చర్చించాలని కోరారు. 

Also REad:కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అమిత్ షా రేపటి సభలో సమాధానం చెప్పాలి.. సీఎం కేసీఆర్

రైతు బంధు, పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రులు తమను నిలదీశారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు బంద్ పెట్టాలని అంటున్నారని తెలిపారు.గుజరాత్ ఇస్తున్నా రూ. 600 పింఛను ఇక్కడ ఇవ్వాలని అంటున్నారని చెప్పారు. కేంద్రం అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ బ్యాంకులను ముంచే వాళ్లకు పంచుతుందని విమర్శించారు. దేశంలో విద్వేషం పుట్టిస్తే మంచిదా? అని ప్రశ్నించారు. మత విద్వేషాలు పెరిగితే నష్టపోయేది దేశ ప్రజలేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలో నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలపునిచ్చారు. 

బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తుందని మండిపడ్డారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ను పడగొడతా అంటున్నారని తెలిపారు. మోదీని ఆయన అహంకారమే పడగోడుతుందని చెప్పారు. ఈడీకి దొంగలు, లంగలు భయపడతారని.. తామేందుకు భయపడతామని కేసీఆర్ అన్నారు. ఈడీ వస్తే తన దగ్గర ఏముందని.. వాళ్లే తనకు చాయి తాగించి పోవాలే అని అన్నారు. బీజేపీ గోకినా గోకకపోయినా.. నేను గోకుతా అని చెప్పానని అన్నారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios