అసెంబ్లీ లో కోెమటిరెడ్డి సవాల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వాచ్ మెన్ గా పనిచేస్తానంటున్నాడు. నల్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉండి, ధనబలం, అంగబలం కూడా ఉన్న నేత ఇలా అంటున్నాడేమిటీ అని ఆశ్చర్యపోకండి.

అసెంబ్లీలో కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు డిపాజిట్‌ తెచ్చుకుంటే నేను టీఆర్‌ఎస్‌ ఆఫీసులో వాచ్‌మెన్‌గా పనిచేస్తానని సవాల్ విసిరారు.

అయితే ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తోంది. నేను ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటా అని భాస్కర్ రావు కౌంటర్ ఇచ్చారు.