తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి సంచలనం

తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి సంచలనం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్ గా మొదలయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రణరంగంగా మారింది. గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలి నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపి సభలో విసిరేశారు.

అయితే తొలిరోజు అసెంబ్లీలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం సృష్టించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద ఉన్న హెడ్ సెట్ గవర్నర్ వైపు విసిరికొట్టారు. ఈ ఘటనతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ కు తగలలేదు. కానీ.. పక్కనే ఉన్న శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తలకు తలిగింది. దీంతో ఆయనకు గాయమైంది. ఆయనను వెంటనే సరోజిని కంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా తన చర్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్థించుకున్నారు. వెల్ లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. నిరసన తెలిపడం ప్రజాస్వామ్యంలో హక్కు అని స్పష్టం చేశారు. తన చర్యలో ఏమాత్రం తప్పులేదన్నారు. రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సభలో నిరసన తెలిపింది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇక గవర్నర్ ప్రసంగాన్ని తెలంగాణ బిజెపి బహిష్కరించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos