కేసిఆర్ సర్కారుకు కోమటిరెడ్డి డెడ్ లైన్

komati reddy deadline to kcr
Highlights

నల్లగొండ మీద వివక్ష ఎందుకు ?

తెలంగాణ సర్కారుకు ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి డెడ్ లైన్ విధించారు. డెడ్ లైన్ లోగా తన డిమాండ్ పరిష్కరించకపోతే తెలంగాణ సర్కారు సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన పెట్టిన డెడ్ లైన్ ఏంది? ఆయన డిమాండ్ ఏంది? వివరాలు చదవండి.

నల్లగొండలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు సాయంత్రంలోగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని సర్కారును హెచ్చరించారు. లేకపోతే రేపు ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ కేసు వేస్తానని స్పష్టం చేశారు. ఇంకా అనేక అంశాలపై మాట్లాడారు ఆయన మాటల్లోనే...

నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎన్నో ఏండ్ల తరువాత మెడికల్ కాలేజి వచ్చింది...కానీ

సిద్దిపేట మెడికల్ కాలేజీకి 700 కోట్లు ఇచ్చి, నల్గొండ కి మాత్రం 250 కోట్లే ఇచ్చిర్రు. వాళ్ళ ప్రాంతానికి ఒకరకంగా, మన ప్రాంతానికి ఒక రకంగా నిధులు మంజూరు చేస్తున్నరు. వాళ్ళ ప్రాంతంలో ప్రమాదంలో చనిపోతే ఒకరకంగా, మన ప్రాంతంలో ఒక రకంగా ఎక్స్ గ్రేషియా ఇస్తున్నరు.

బతుకమ్మ చీరెలకు కేవలం సిరిసిల్ల కే 250 కోట్ల అర్డర్ ఇచ్చారు అంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో చేరెలు నేయరా? కేవలం సిరిసిల్ల సిద్దిపేట కు మాత్రమేనా కేసిఆర్ సిఎం. కాళేశ్వరనికి ఎక్కువ నిధులు, ఎస్ఎల్బీసి కి నిధులు ఉండవు. నల్గొండ జిల్లా తెలంగాణలో ప్రాంతం కాదా? కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని చెప్పిన కేసిఆర్ ఎస్ఎల్బీసి ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. నేను మొదలు పెట్టించింది కాబట్టే ఇంత నిర్లక్ష్యం. మిషన్ భగీరథ కుంభకోణాల పై ప్రశ్నించినందుకు ఇలా చేస్తున్నారు.

బొడ్డుపల్లి శ్రీను హత్య, అకారణంగా ఎమ్యెల్యే పదవి రద్దు, గన్ మెన్ ల తొలగింపు. నాపై కావాలనే కుట్ర జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు  ఎమ్యెల్యే గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న. లేకుంటే రేపు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేయబోతున్న.

టీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెక్కులు నిలిపివేస్తున్నారు. పండించే పంటకు మద్దతు ధర, బోనస్ ఇస్తే రైతులు బాగుపడతారు. జూన్ 2 న 50 వేల పోస్టులని నిరృద్యోగులను మోసం చేస్తున్నారు. ఐకేపీ ధాన్యం డబ్బులు, ఉపాధి హామీ పనుల బకాయిలు అన్ని పెండింగులో నే ఉన్నాయి.

ఆర్టీసీ ని ఎత్తేయ్యేడానికే కుట్ర జరుగుతుంది. ఆర్టీసీ న్యాయమైన డిమాండ్లకు మా పూర్తి మద్దతు ఉంటుంది.

loader