ఈ మండలాన్ని కాకి ఎత్కపోయిందా ? (వీడియో)

First Published 22, Dec 2017, 5:36 PM IST
kodandaram wonders how a mandal name disappeared overnight
Highlights
  • గట్టుప్పల్ వారికి అన్యాయం చేసిర్రు
  • రాత్రికి రాత్రే నిర్ణయాన్ని మార్చేసిర్రు
  • ప్రజల కోసమా జిల్లాలు? నాయకుల కోసమా?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ జెఎసి అమరుల స్పూర్తి యాత్ర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా సమస్యపై జెఎసి ఛైర్మన్ కోదండరాం ఫోకస్ చేసి సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో కోదండరాం ఒక సమస్యను చూసి చలించిపోయారు.

జిల్లాల విభజన సమయంలో మనుగోడు లోని గట్టుప్పల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తారని ప్రచారం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మార్వో ఆఫీసు, ఎంపిడిఓ ఆఫీసు, పోలీసు స్టేసన్ బోర్డులు ఏర్పాటు చేసి.. రాత్రికి రాత్రే మండలాన్ని మాయం చేశారు ఎందుకు అని కోదండరాం నిలదీశారు. ఈ మండలాన్ని కాకి ఎత్కపోయిందా అని ఎద్దేవా చేశారు.

430 రోజులుగా వారు ఆందోళన చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే వారి సమస్య పరిష్కరించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. కోదండరాం మాట్లాడిన మరిన్ని విషయాలు కింద ఉన్న వీడియోలో చూడండి.

loader