కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కోదండరాం పేర్కొన్నారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

రాష్ట్రంలోని రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
రైతాంగ సమస్యలపై జేఏసీ ఇకపై నిరంతర పోరాటం చేస్తోందని ప్రకటించారు. 24 మందితో రైతు జేఏసీ పేరుతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. తాను అందులో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.
భూ నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరుతో రైతులను ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు.
