డిప్యూటీ సీఎం భట్టితో కోదండరామ్ భేటీ.. టీజేఎస్ చీఫ్ కు మంత్రి పదవి ఖాయమైనట్టేనా ?
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ (professor kodandaram).. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(deputy cm bhatti vikramarka)ను సోమవారం కలిశారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వీరి మధ్య భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో కోదండరామ్ కు మంత్రి పదవి దక్కబోతోందని ప్రచారం మొదలైంది.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సోమవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కలిశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య భేటీ రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. టీజేఎస్ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కబోతున్నట్టు సాంకేతాలు కనిపిస్తున్నాయి.
సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.. స్థలం, రూ.20 లక్షల లోన్ ఇస్తాం - మంత్రి పొంగులేటి..
అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోదండరాం వెంట ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్య కూడా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ బహిరంగంగానే మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోదండరామ్ కోరారు.
ration cards : కొత్త రేషన్ కార్డులు మరింత ఆలస్యం.. కారణమేంటంటే ?
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండ రామ్ వంటి నాయకుల సలహాలు, సూచనలతో ప్రభుత్వ పాలన సాగిస్తామని తెలిపారు. అంతకు ముందు అక్టోబర్ 30వ తేదీన కూడా టీజేఎస్ అధ్యక్షుడిని కలిసి కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
దావుద్ ఇబ్రహీంకు షాక్.. ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైన భారత ప్రభుత్వం..
రెండు వారాల క్రితం టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి నగరంలో టీజేఎస్ అధ్యక్షుడు, ఇతర పదాధికారులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 5న ఈ సమావేశం జరిగింది. అయితే తాజా భేటీలో ఈ విషయం చర్చించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో టీజేఎస్ నేతలకు కేటాయింపులు జరిగే అవకాశం ఉందనే సాంకేతాలు కనిపిస్తున్నాయి.
పాతబస్తే అసలైన హైదరాబాద్.. హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దు - అసదుద్దీన్ ఒవైసీ..
టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ కు రాజ్యసభ సీటు ఇస్తారని లేకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. లేకపోతే ఎమ్మెల్సీగా నామినేట్ చేసి ఇతర పదవులను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ పదవుల కేటాయింపుపై కాంగ్రెస్, టీజేఎస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.