తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంలో నయాజాగిర్దారీ వ్యవస్థ నడుస్తున్నది.నయాజగీర్దారీ వ్యవస్థ అంటే అక్కడ రాజ్యంగం రూల్స్ వుండవు. జాగీర్దార్ ఏది తల్చుకుంటూ అదే రూల్. వాళ్ల మాట వినకపోతే, కొడతారు. వీపు మీద బండ రాయి ఎత్తి మోయిస్తారు. తెలంగాణా మూడేళ్ల పాలనమీద కోదండరాం అన్నమాటలివి
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంలో నయాజాగిర్దారీ వ్యవస్థ నెలకొనిందని తెలంగాణా జెఎసి చెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. మూడేళ్ల తెలంగాణా మీద జర్నలిస్టుల వేదిక ఇక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ లో ప్రసంగిస్తూ కోదండరామ్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పరిపాలనా తీరును తీవ్రంగా అక్షేపించారు.అయితే, ఆయనెక్కడా కెసిఆర్ పేరెత్త లేదు. కాకపోతే, అపుడపుడూ ముఖ్యమంత్రి అంటూ దుమ్ము దులిపారు.
ఏ తెలంగాణా కోసం పోరాడారో ఆ తెలంగాణా రాలేదని దాని స్థానంలో నయాజాగీర్దారీ వ్యవస్థ వచ్చిందని ఆయన అన్నారు.
నయాజగీర్దారీ వ్యవస్థ అంటే అక్కడ రాజ్యంగం రూల్స్ వుండవు. జాగీర్దార్ ఏది తల్చుకుంటూ అదే రూల్. వాళ్ల మాట వినకపోతే, కొడతారు. వీపు మీద బండ రాయి ఎత్తి మోయిస్తారు,’ అని ఆయన అన్నారు.
తెలంగాణాలో ఇపుడు అన్ని వ్యవస్థలో కుప్పకూలిపోయాయి. పరిపాలన మొత్తం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమయిఉందని ఆయన అన్నారు.
ఈ బాధలను, కష్టాలను ఎవరికి చెప్పాలో ఒక వేదిక లేకుండా పోయింది. ముఖ్యమంత్రిని కలవడమే సాధ్యంకాదని ఆయన అన్నారు.
“ఎమ్మెల్యేదగ్గిర వెళితే, ‘నాచేతిలో ఏముందే, నీకు తెలియందేముంది, అంతా పైన పెద్దాయలనే’ అంటారు. మంత్రి దగ్గరకు వెళితే, ‘నేనేం చేస్తాం. నేనేమో రాసి పంపిస్తా. పైన అంతా పెద్దాయనే చూసుకుంటారు’ అంటున్నారు.“ అని కోదండ రామ్ చెప్పారు.
‘పరీక్ష పత్రాలు లీక్ అవుతాయి, ఏ చర్య తీసుకున్నట్లు కనిపించదు. వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోతున్నాయి, ఎవరితో చెప్పుకోవాలి. పెద్దాయనకు చెబుదామా అంటే దారే లేదు. యూనివర్శిటీలలో సిబ్బంది లేరు. ఏడాది కాలం గా ఈ పరిస్థితి గురించి చెబుతూనే వస్తున్నారు. డిపార్ట్ మెంట్లలో సిబ్బంది లేక పాలన కునారిల్లిపోయింది. వెటర్నీరీ విద్యార్థులు నెలరోజులుదీక్షచేస్తే పట్టించుకోలేదు. వాళ్లడిగిందేమిటీ, వెటర్న రీసర్వీసులలో కాంట్రాక్టు ఉద్యోగాలు వద్దనే.’ అని కోదండరాం అన్నారు.
ప్రభుత్వంలో అవినీతి తాండవిస్తోందనిచెబుతూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో జరగుతున్న వృధా వ్యయం ఆపితే తెలంగాణా మొత్తం నీళ్లివ్వ వచ్చని అన్నారు.
అసలు ప్రభుత్వం ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తూ, 700 ఎకరాల ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడుకాకుండా ప్రయివేటువ్యక్తుల పేరుతో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఫ్రొఫెసర్ కోదండ్ రామ్ అన్నారు. టీచర్ల అవార్డులను కూడా డబ్బులకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలుకోరుకుతున్న తెలంగాణా కోసం తాము పోరాడతామని, ఈ ఉద్యమం ఆగదని చెప్పారు.
