స్వరం పెంచిన టీ జేఏసీ చైర్మన్ కోదండరాంకేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుపేదల భూములు గుంచుకోవడంపై ఫైర్
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం సర్కార్ తీరుపై స్వరం పెంచారు. పేదల భూములను ప్రాజెక్టుల కోసం ఆక్రమించడంపై మండిపడ్డారు.నయీం భూములు గుంజుకున్నట్లు కేసీఆర్ సర్కార్ రైతుల భూములు లాక్కుంటున్నదని ధ్వజమెత్తారు.
బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూ నిర్వాసితుల సదస్సులో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రాజెక్టులు ముఖ్యమని, అయితే వాటి కోసం రైతుల భూములను అక్రమంగా లాక్కోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలతో సంప్రదింపులు జరిపి భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రజల భాగస్వామ్యంతో నిపుణులతో చర్చించి ప్రాజెక్టులు రూపకల్పన చేయాలన్నారు. లేదంటే ప్రాజెక్టులను వెంటనే ఆపాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కితగ్గకపోతే అసెంబ్లీ సమావేశాల సమయంలో ధర్నా చేపడుతామని హెచ్చరించారు.
