డిసెంబర్ 3 ను ఉపాధి దినంగా గుర్తించాలన్న కోదడంరాం

2009 డిసెంబర్ 3 ... తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుతిప్పిన రోజు. కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ ఆ రోజు హైదరాబాద్ ఎల్ బి నగర్ చౌరస్తా వద్ద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కాసోజు శ్రీకాంతచారి ఆత్మార్మణం చేసుకున్నాడు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా నిలిచిన శ్రీకాంత చారి త్యాగాన్ని గుర్తించేందుకు వీలుగా ఆయన మరణించిన డిసెంబర్ 3 ను తెలంగాణ ఉపాధి దినంగా నిర్వహించాలని టి జెఏసి చైర్మన్ ప్రొ. కోదండరాం డిమాండ్ చేశారు.


శుక్రవారం ఓయూ అతిథిగృహం సెమినార్ హాల్‌లో నిర్వహించిన శ్రీకాంతాచారి ఏడో వర్థంతి సభలో ఆయన ప్రసంగించారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని కోదండరాం పేర్కొన్నారు. ఆయన వర్థంతిని ప్రభుత్వమే ఉపాధి దినంగా గుర్తించి నిర్వహించాలని కోరారు.

నవంబర్ 29 ని దీక్ష దివస్ చేపట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు కనీసం శ్రీకాంత చారి వర్థింతిని ఉపాధి దినంగా నిర్వహించడానికి ముందుకు వస్తారా... ప్రభుత్వం కోదండరాం డిమాండ్ ను పరిశీలిస్తుందా ? అనే ది సందేహమే.

ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ .. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శ్రీకాంతచారి కుటుంబాన్ని టిఆర్ఎస్ నేతలు పెద్దగా పట్టించుకోవడమే లేదు.