Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం మళ్లీ అరెస్టు (వీడియో)

  • కోదండరాం  తూప్రాన్ వద్ద అరెస్టు
  • నాలుగో దశ స్పూర్తియాత్ర సంపూర్ణంగా భగ్నం
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు జెఎపి పిలుపు
Kodandaram arrest at tupran toll plaza

 

తెలంగాణ సర్కారు పంతం నెగ్గించుకుంది. స్పూర్తి యాత్ర నాలుగో దశను సంపూర్ణంగా భగ్నం చేసింది. నిన్న బికునూరు వద్ద కోదండరాం ను అరెస్టు చేసిన ప్రభుత్వం తిరిగి హైదరాబాద్ తరలించింది. ఇవాళ మెదక్ బార్డర్ లోనే కోదండరాం ను అరెస్టు చేసేసింది. నిజామాబాద్ వెళ్లేందుకు అనుమతి లేదంటూ వందల సంఖ్యలో పోలీసులు తూప్రాన్ టోల్ గేట్ వద్ద కోదండరాం ను కలదనీయకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. నిజామాబాద్ లో ర్యాలీ కి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో అక్కడ హాల్ మీటింగ్ మాత్రమే జరుపుకుంటామని జెఎసి పోలీసులకు విన్నవించింది. అయినా ర్యాలీకి లేదు, తుదకు హాల్ మీటింగ్ కు కూడా అనుమతి లేదంటూ పోలీసులు కోదండరాం ను హైదరాబాద్ పొలిమేరలు దాటకముందే అరెస్టు చేశారు. నిజామాబాద్ లో కాలు పెట్టనిచ్చేదిలేదన్నట్లు పోలీసులు వ్యవహరించారు.

 

  • ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసనలు తెలియచేయండి-టీజేఏసీ

పోలీసులు బహిరంగ సభను నిరాకరిస్తే...ఆ ఆదేశాలను గౌరవిస్తూ బహిరంగసభను రద్దు చేసుకుని హాల్ మీటింగ్ పెట్టుకుంటామని ప్రకటించి నిజామాబాద్ వెళ్తున్న ప్రొ. కోదండరాంని అరెస్టు చేయడం పట్ల జెఎసి నిరసన తెలిపింది. కోదండరాంని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని టీజేఏసీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కోదండరాంపై లేని నిర్బంధం తెలంగాణ వచ్చిన తర్వాత సొంత రాష్ట్రంలో నిర్బంధాలకు గురిచేయడం పట్ల జెఎసి ఆందోళన చేపడుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios