Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం అరెస్టు, స్పూర్తి యాత్ర భగ్నం

  • కోదండరాం స్పూర్తి యాత్ర భగ్నం
  • బిక్నూరులో కోదండ అరెస్టు
  • హైదరాబాద్ తరలింపు
  • సర్కారు తీరుపై జెఎసి ఆగ్రహం
  •  
kodandaram arrest and spoorthy yatra ruined

తెలంగాణ సర్కారు పంతం నెగ్గించుకుంది. గులాబీ శ్రేణులను పురమాయించి క్షణాల్లో శాంతి భద్రతల సీన్ క్రియేట్ చేసింది. ఇంకేముంది మన ఫ్రెండ్లీ పోలీసులు రంగంలోకి దిగిర్రు. అమరుల స్పూర్తి యాత్రను భగ్నం చేసిర్రు. బిక్నూరు పోలీసు స్టేషన్ లోనే కోదండరాం ను అరెస్టు చేసిర్రు. తర్వాత పోలీసు వాహనంలో హైదరాబాద్ తరలించిర్రు. మొత్తానికి సర్కారు తలుచుకుంటే కానిదేముందన్న సామెత ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. అది ఇప్పుడు తెలంగాణలో కూడా అప్లై అయింది.

కోదండరాం నాలుగో విడత అమరుల స్పూర్తియాత్రకు బ్రేక్ వేసింది తెలంగాణ సర్కారు. కోదండరాం ను బిక్నూరు పోలీసు స్టేషన్ లో నిర్బందంలోకి తీసుకున్న పోలీసులు తుదకు అరెస్టు చేశారు. నాలుగు గంటల పాటు పోలీసు స్టేషన్ లోనే కోదండరాం చెట్ల కింద కూర్చున్నారు. ఆయనతోపాటు పెద్ద సంఖ్యలో జెఎసి ప్రతినిధులను కూడా అక్కడే అడ్డుకున్నారు.

ఇక యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. కానీ కోదండరాం యాత్ర చేసి తీరతానని చెప్పడంతో అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు.

దీంతో నాలుగో దశ అమరుల స్పూర్తి యాత్ర నిలిచిపోయింది. సాయంత్రం 5.30 గంటలకు కోదండరాం తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సర్కారు తీరును ఎండగట్టే అవకాశం ఉంది. దీనితోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios