ఉద్యమకారులకు గౌరవం ఏదీ: కేటీఆర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది.ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కొంత కాలంగా రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.
 

Kishan Reddy Reacts On Telangana Minister kTR Comments


హైదరాబాద్: తెలంగాణ మంత్రి KTR  కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి Kishan Reddy  కూడా ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కొంత కాలంగా టీఆర్ఎస్ , బీజేపీకి మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అవకాశం దొరికితే  టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేసుకొంటున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.  కేంద్రంలోని BJP  పాలనలో బొగ్గు, ఆక్సిజన్, విద్యుత్, ఉపాధి నిధులకు కూడా కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.  

ప్రధాని Narendra Modiకి విజన్ లేని కారణంగాఈ సమస్యలు వస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. ఈ మేరకు వివరాలతో కూడా ఓ ఫోటోను కూడా కేటీఆర్ తన ట్వీట్ కు జత చేశారు. ఈ ట్వీట్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగం లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైందని కూడా ఆయన ప్రశ్నించారు.ఉచిత ఎరువులు ఏమయ్యాయని కిషన్ రెడ్డి అడిగారు.

 

రుణమాఫీ ఇంతవరకు పూర్తి చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న హమీ ఏమైందని కేటీఆర్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి.దళితులకు మూడు ఎకరాల భూమి ఏమైందని అడిగారు.
పంట నష్టపరిహారం లేదన్నారు. దళిత బంధు, బీసీ బంధు ఏమయ్యాయని కిషన్ రెడ్డి కేటీఆర్ ను ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని కూడా కిషన్ రెడ్డి అడిగారు.

Telangana రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొస్తున్న విషయాన్ని కూడా కిషన్ రెడ్డి ప్రస్తావించారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం లేదన్నారు. సామాజిక న్యాయం లేనే లేదన్నారు. సచివాలయం లేదు, ప్రజలను సీఎం కలిసేదే లేదంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ కారులకు కేసీఆర్ సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కూడా కేసీఆర్ సర్కార్ తీరును ట్విట్టర్ పై కిషన్ రెడ్డి ఎండగట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios