హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరవాసులకు డబ్బు ఎరచూపి విదేశాలకు తీసుకెళ్లి సర్జరీలు చేయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నిందితుడిపై తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులున్నాయి.

కిడ్నీలు పాడైపోవడం వల్ల ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్న విదేశీయులతో ఈ ముఠా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారికి డబ్బు ఎరచూపి.. శ్రీలంక వంటి దేశాలకు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తోంది.

అయితే విదేశీయుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న గ్యాంగ్.. బాధితులకు మాత్రం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు.

నిందితుడు శ్రీనివాస్ గతంలో ఆరు నెలల పాటు జైల్లో ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు.