ఖమ్మం: మూడు నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది. ఈ కేసులో పోలీసులు గుంటూరుజిల్లాకు చెందిన పూజారి సూర్యప్రకాశ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూర్యప్రకాశ్ శర్మ బాలికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

పూజారి సూర్యప్రకాశ్ శర్మ క్షుద్రపూజల నిమిత్తం ఖమ్మం జిల్లా రేమిడిచర్లకు వచ్చాడు. క్షుద్రపూజల కోసం రేమిడిచర్లలోని ఓ ఇంటిలో 25 అడుగుల లోతు గోయి కూడా తవ్వారు. ఆ సమయంలోనే బాలికను సూర్యప్రకాశ్ శర్మ కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. 

బాలిక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని గుర్తించి పోలీసులు ఆమెను తీసుకుని వచ్చారు. బాలికను ప్రస్తుతం ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచారు. త్వరలో బాలికను తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.

నిందుతుడు సెల్ ఫోన్ వాడడం లేదని, దానివల్ల ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని పోలీసులు చెబుతూ వచ్చారు మొత్తం మీద బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.